నవతెలంగాణ – తొగుట
తొలి ఏకాదశి పర్వదినంను పురస్కరించుకొని మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో తొలి ఏకా దశి పర్వదినంను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలతో పాటు, వెంకట్రావు పేట, తుక్కాపూర్ దళిత గోవిం దం, వెంకట్రావుపేట వేణుగోపాల స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ కమి టీ చైర్మన్ రాయరావు అరుణ~రఘుపతి రావు, ఆలయ అర్చకులు రామకృష్ణ చార్యులు ఆధ్వర్యం లో ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామి కి ప్రత్యేక అర్చన, తులసి అభిషేకం, ప్రత్యేక పూజాది కార్య క్రమంలు నిర్వహించారు. శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయములో తొలి ఏకాదశి సందర్భముగా సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదములు తెలుపుకుంటూ గ్రామము దిన దిన అభివృద్ధిచెం దాలని మన వేణుగోపాల్ స్వామి కృపా కటాక్షాలు అందరిమీదా ఉండాలని స్వామి మంగళ శాసన ములు అర్చకులు తెలియజేశారు. తొగుట ఏఎస్ఐ గిడిపల్లి రాంరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కన్నుల పండువగా మండల వ్యాప్తంగా ఘనంగా తొలి ఏకాదశి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES