Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వనదేవతలను దర్శించుకున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్  

వనదేవతలను దర్శించుకున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్  

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి 
మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను ఆదివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కుటుంబ సమేతంగా మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. ఎండోమెంట్ అధికారులు, పూజారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క- సారలమ్మ, పగిడిదిరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. అనంతరం పూజారులు ఎండోమెంట్ అధికారులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం మేడారంలోని చిలకలగుట్ట, జంపన్న వాగు, సార్లమ్మ ఆలయం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, శివరాం సాగర్ చెరువు, తదితర భక్తులు అధికంగా ఉండే ప్రదేశాలను తిరిగి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారంలో ప్రకృతిలో వనదేవతలను దర్శించుకోవడం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. కోరిన మొక్కులు తీర్చే సమ్మక్క సారలమ్మ జాతర్లకు ఇప్పటినుండి భక్తుల సందడి మొదలైంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఆయన వెంట భూపాల్ పల్లి ఎస్ఐ తాజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -