Monday, July 7, 2025
E-PAPER
Homeఖమ్మంవైద్యసిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలి…

వైద్యసిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలి…

- Advertisement -
  • – ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి..
    – ఆకస్మికంగా తనిఖీ చేసి ఎమ్మెల్యే జారే… 

    నవతెలంగాణ – అశ్వారావుపేట
    వాతావరణం లో మార్పు,అడపాదడపా వానలు నేపద్యంలో తరుణ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఆసుపత్రిలో వైద్యులు నిత్యం అందుబాటులో ఉండాలని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విధుల్లో ఉన్న డాక్టర్ శివ రామక్రిష్ణ కు ఆదేశించారు. ఆదివారం ఆయన నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
    • నిర్మాణంలో 100 పడకల ఆసుపత్రి భావన నిర్మాణ పనులను పరిశీలించారు.త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ప్రభుత్వ అనుమతులు పొందిన ఎకో పార్క్ నిర్మాణానికి మండల నాయకులతో కలసి స్థల పరిశీలన చేశారు ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు వర్షాకాలం నేపథ్యంలో చోటుచేసుకునే సీజనల్ వ్యాధులకు సంబంధించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అక్కడి వైద్యులచే అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -