Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్గీకరణ ప్రకారమే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలి: ముక్కపల్లి రాజు మాదిగ 

వర్గీకరణ ప్రకారమే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలి: ముక్కపల్లి రాజు మాదిగ 

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక 
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం పక్కాగా అమలు జరిగేలా చూడాలని, వర్గీకరణ ప్రకారం సర్టిఫికెట్లు ఇవ్వకుండా మాదిగలను ఇబ్బందులకు గురిచేస్తుందని, ఎస్సీ వర్గీకరణ చట్టం ప్రకారమే మాదిగ లకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కపల్లి రాజు మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం దుబ్బాక లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ సాధన అని..  ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈనెల 7 న ఊరూరా ఎమ్మార్పీఎస్ జెండాలు ఎగురవేసి సంబరాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి ఇస్తారిగల్ల ఎల్లం, దుబ్బాక మండలాధ్యక్షులు దొమ్మట జోగయ్య, బీజేఆర్ సంఘం అధ్యక్షులు చెక్కపల్లి రాజమల్లు, సీనియర్ నాయకులు మరాఠి బాబు పలువురున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -