– నిర్ణయాత్మక పట్టికలో స్థానం కోల్పోతున్నాం :
బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొననున్న ప్రధాని మోడీ
రియో డి జనీరో: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సహకారాన్ని అందించే దేశాలు నిర్ణయాత్మక పట్టికలో స్థానం కోల్పోతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనడం కోసం ఆదివారంనాడాయన బ్రెజిల్‌కు చేరుకున్నారు. ఇక్కడి గలేయో అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి సాదర స్వాగతం లభించింది. బ్రిక్స్ సమ్మిట్‌లో బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధ్యక్షులతో సహా ఆరు సభ్య దేశాల నాయకులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా అధ్యక్షులు రామఫోసాతో బేటీ అయినట్టు ఎక్స్ వేదికగా తెలిపారు. వారిరువురూ పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ 20వ శతాబ్దంలో ఏర్పడిన ప్రపంచ సంస్థల్లో మూడింట రెండు వంతుల మందికి తగిన ప్రాతినిధ్యం లభించలేదన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా పలు కీలక సంస్థల్లో తక్షణ సంస్కరణల కోసం ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. గ్లోబల్ సౌత్ అనేది లేకపోతే, సిమ్‌కార్డు ఉన్నా నెట్‌వర్క్‌లేని మొబైల్‌ఫోన్‌లాగే ప్రపంచం ఉంటుందని ఉదహరించారు. గ్లోబల్ సౌత్ పర్యావరణం, ఆర్థిక సహకారం, స్థిరమైన అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ముందున్నదని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సహకారం అందించే దేశాలకు నిర్ణయాధికారం లేకుండా పోయిందన్నారు. సంస్కరణల ప్రభావం సమాజంలో కనిపించాలన్నారు. బ్రిక్స్ దేశాలతో పాటు అన్ని అంశాలపై నిర్మాణాత్మక సహకారాన్ని అందించేందుకు భారతదేశం కట్టుబడి ఉన్నదని చెప్పారు. బ్రిక్స్ సమావేశంలో ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి, గాజాలో మానవతా సంక్షోభం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు వంటి పలు అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
గ్లోబల్ సౌత్‌పై ‘డబుల్ స్టాండర్డ్స్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES