Monday, July 7, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్వాహ‌న‌దారుల‌కు షాక్‌..డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

వాహ‌న‌దారుల‌కు షాక్‌..డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రోడ్డుపై వాహనాన్ని నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అయితే ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపేవారిపై, డ్రంక్ అండ్ డ్రైవ్, నిర్లక్ష్యంగా బండి నడిపేవారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 19 వేల డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేసింది తెలంగాణ రవాణాశాఖ. ఈ మేరకు రవాణాశాఖ యాన్యువల్ రిపోర్టు విడుదల చేసింది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు అధికం అయ్యాయి. ముఖ్యంగా నగరాల్లో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో తోటి ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రవాణాశాఖ కఠిన చర్యలకు పాల్పడుతోంది. రాష్ట్రంలో దాదాపు 19 వేల డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేసింది. 2023 డిసెంబర్ నుంచి 2025 జూన్ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల మందికి డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేసి షాక్ ఇచ్చింది.

తెలంగాణ రవాణాశాఖ జులై 4 న విడుదల చేసిన ప్రగతి నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. 2023 డిసెంబరు నుంచి 2025 జూన్‌ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18,973 డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దు చేసినట్లు రవాణాశాఖ ఈ ప్రగతి నివేదికలో తెలిపింది. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, అతి వేగం, డ్రగ్స్ తీసుకుని వాహనం నడపడం వంటి తీవ్ర ఉల్లంఘనల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు తెలంగాణ రవాణాశాఖ మరో కీలక నిర్ణయం తీసకుంది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్, ఇతర సేవలను సులభతరం చేసేందుకు ‘వాహన్‌’ అనే అప్లికేషన్‌ ను అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ అప్లికేషన్ ను స్టడీ చేసి తెలంగాణలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ యాప్ సేవలు ఆగస్టు చివరి నాటికి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీతో పరిమితి లేకుండా 100 శాతం రోడ్‌ ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజు నుంచి మినహాయింపు ఉందని అధికారులు తెలిపారు. 2024 నవంబరు 16వ తేదీ నుంచి 2025 జూన్‌ 30వ తేదీ వరకు 49,633 ఎలక్ట్రిక్​వెహికల్స్​(ఈవీ) కు రూ.369.27 కోట్ల రోడ్​ట్యాక్స్​మినహాయింపును ఇచ్చినట్లుగా ప్రగతి నివేదికలో పేర్కొన్నారు.

రాష్ట్రానికి చెందిన వెహికల్స్ రిజిస్ట్రేషన్‌ కోడ్‌ TS ను 2024 మార్చి 15 నుంచి TG గా మార్పు చేసినట్లుగా నివేదికలో అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి 13.05 లక్షల వాహనాలు TG కోడ్‌ తో మార్పు చేసుకున్నట్లు వివరించారు. అంతేకాక రాష్ట్రంలో 25 బైక్​ల ట్రాక్‌ లు, 27 ఫోర్‌ వీలర్, 5 భారీ వాహనాల ట్రాక్‌ లను అధునాతన సాంకేతికతతో ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ లుగా మార్పు చేసేందుకు నిర్ణయం తీసకున్నట్లు నివేదికలో అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -