భువనగిరి పట్టణంలోని రాంనగర్, సీతినగర్, జంకన్ గూడెం అభివృద్ధికి సహాకారించండీ
ఎమ్మెల్యేను కోరిన బర్రె జహంగీర్, మున్సిపల్ మాజీ చైర్మన్
నవతెలంగాణ – భువనగిరి : దళితవాడల అభివృద్ధికై నిధులు మంజూరు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డిని మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం భువనగిరి మున్సిపల్ పట్టణంలోని 8వ వార్డు రామ్ నగర్ లో కమ్యూనిటీ హాల్, పాఠశాల నూతన భవన నిర్మాణం, సీతానగర్, జంకన్ గూడెం కాలనీలలో సీసీ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించాలని కోరారు.
దీంతోపాటు 8వ వార్డులల్లోని సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి మున్సిపల్ పట్టణంలో గత బీఆర్ఎస్ కౌన్సిలర్ పాలకవర్గం 10 ఏండ్ల నిర్లక్ష్యం వల్ల రాంనగర్ కాలనీలో డ్రైనేజీలు లేక మురికి నీరు నిల్లలు పేరుకుపోతన్నాయని అన్నారు. దీనివల్ల ప్రజలు రోగాల బారిన ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీతా నగర్ జంకన్ గూడెం కాలనీలలో డ్రైనేజీ సరిగ్గా లేక ప్రజలు ప్రయోగాంతులకు గురవుతున్నారని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నూతనంగా ఏర్పడ్డ నంద గుట్ట నూతన కాలనీలో మంచినీటి వసతి లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. మురికి కాలువలు, సీసీ రోడ్లు మీరు పట్టణంలో అభివృద్ధి చేస్తున్న క్రమంలో వాడుకుని నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కుంభంఆయన కోరారు. ఆయనతోపాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడుత రమేష్, కుర్మ సుధాకర్, ఎండి ఇఫ్తాకర్, కరుణాకర్,పరశరామ్, ఏడవెల్లి శ్రీను, ఎండి షఫీ, పాల్గొన్నారు.
దళిత వాడల అభివృద్దికి నిధులు మంజూరు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES