నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ఠం చేసే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కీలక చర్యలు చేపట్టింది. సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన టీపీసీసీ, తాజాగా 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే నియామకాలు చేపట్టిన కాంగ్రెస్, ఇప్పుడు జిల్లాలపై దృష్టి సారించింది. ఈ నియామకాల అనంతరం ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నూతన ఇన్‌ఛార్జ్‌లతో జూమ్ వేదికగా సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన విధివిధానాలను వారికి స్పష్టంగా వివరించారు. త్వరలోనే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మీనాక్షి నటరాజన్ వెల్లడించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేతలంతా తక్షణమే క్షేత్రస్థాయిలో విధుల్లో చేరాలని ఆమె దిశానిర్దేశం చేశారు.
ఉమ్మడి జిల్లాల వారీగా నియమితులైన ఇన్‌ఛార్జ్‌ల వివరాలు:
ఖమ్మం: వంశీచంద్‌రెడ్డి
నల్గొండ: సంపత్ కుమార్
వరంగల్: అడ్లూరి లక్ష్మణ్
మెదక్: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: జగ్గారెడ్డి
మహబూబ్‌నగర్: కుసుమ కుమార్
ఆదిలాబాద్: అనిల్ యాదవ్
కరీంనగర్: అద్దంకి దయాకర్
నిజామాబాద్: అజ్మతుల్లా హుస్సేన్
రంగారెడ్డి: శివసేన రెడ్డి