Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

- Advertisement -

– కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : యువకులందరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ అనిల్ రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వలన జరిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు ఎస్ఐ అవగాహన కల్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందన్నారు. ఆ యువత గంజాయి మొదలైన మత్తు పదార్థాలకు బానిస అయితే, విచక్షణ కోల్పోయి జంతువుగా మారి వ్యక్తిగతంగా నష్టపోవడమే కాకుండా కుటుంబం, దేశ భవిష్యత్తుకు విఘాతం కల్పిస్తారన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల భవిష్యత్తు చిన్నభిన్నమవుతుందని, వాటికి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తును కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు. మత్తు పదార్థాల  వినియోగం వల్ల సమాజంలో నేరాల సంఖ్య పెరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.

అనంతరం కళాశాల విద్యార్థులతో అందరితో  డ్రగ్ వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మధు కుమార్, రాజ్ కుమార్, వెంకటేష్, గంగారం, మహేందర్, స్వాతి, సుమతి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -