Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రయివేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి

నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రయివేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రయివేట్ ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. జిల్లా కేంద్రంలో గుర్తింపు లేని అనేక ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న వైద్య వ్యాపారాన్ని జిల్లా అధికారులు అందించకపోవడంతో యదేచ్ఛగా ఇష్టానుసారంగా టెస్టుల పేరుతో, ఆపరేషన్ల పేరుతో విపరీతంగా డబ్బులు వసూలు చేస్తూ పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారని వారు అన్నారు.

ఇప్పటికే జిల్లా కేంద్రంలో గుర్తింపు లేని ఆసుపత్రులు అనేకం వెలిశాయని వారి పట్ల జిల్లా వైద్యాధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో సంబంధం లేకుండా ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని పేరుమోసిన ఆసుపత్రులు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ వేల రూపాయలు బాధితుల వద్ద నుండి వసూలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని వారు అన్నారు. కనీసం వైద్యుడిగా గుర్తింపు లేని ఆర్.ఎం.పి జిఎంపి సర్టిఫికెట్ తో ఆస్పత్రులు నెలకొల్పి బయట నుండి డాక్టర్లను పిలిపించుకొని వైద్య వ్యాపారాన్ని నడుపుతున్నారని వారు అన్నారు. ఇప్పటికే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గుర్తింపు లేని ఆసుపత్రుల సమాచారాన్ని సేకరించడం జరిగింది.

వీటిపై కనీసం జిల్లా వైద్యాధికారులు దృష్టి లేకుండా వారికి యదేచ్ఛగా స్వేచ్ఛనిస్తూ నిర్వహించుకునేల చూస్తున్నారని వారన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న అనేక ల్యాబ్ లు ప్రభుత్వం నిబంధనలను పక్కకు పెట్టి వారికి ఇష్టానుసారంగా అవసరం లేకపోయినా టెస్టులు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని వారు అన్నారు వెంటనే జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి గుర్తింపు లేని ఆసుపత్రులను గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. వీరితోపాటు జిల్లా ఉపాధ్యక్షులు దయ్యాల మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు షేక్ రియాజ్, ఎండి సోహెల్, సాజిద్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -