- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేయాలని ఎంపీడీవో ప్రభాకర్ చారి అన్నారు. సోమవారం మండలంలోని చీనురు గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఏంటి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ కొలతల ప్రకారమే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఏవైనా అనుమానాలు ఉంటే పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను ఆయన పరిశీలించారు పంచాయతీ కార్యదర్శి సరెందర్ కు పలు సలహాలు సూచనలు చేశారు.
- Advertisement -