- Advertisement -
- – అందుబాటులో యూరియా…
- నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాలను సోమవారం అగ్రికల్చర్ ఏ డి ఏ వెంకటేశ్వరరావు భువనగిరి మండల వ్యవసాయ అధికారి డి. మల్లేష్ లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీలో భాగంగా షాపులోని స్టాకు నిల్వలను, ధరల పట్టిక బోర్డు ఇతర ధ్రువీకరణ పత్రాలను స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. భువనగిరి మండలంలో రైతులకు అందుబాటులో యూరియాని సింగిల్ విండో సొసైటీ, ఆగ్రో సేవ కేంద్రాలు, ప్రైవేట్ డీలర్స్ వద్ద అందుబాటులో ఉంచడం జరిగిందనీ , సింగిల్ విండో సొసైటీ వద్ద 120 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్స్ వద్ద 157 మెట్రిక్ టన్సులు, ఆగ్రోస్ సేవ కేంద్రం వద్ద 14 మెట్రో టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులు ఈ సీజన్ కు సంబంధించి అవసరం మేరకు యూరియాను వాడుకోవాలని రైతులకు సూచించారు. రైతులు ఫర్టిలైజర్స్ కొనుగోలు చేసేటప్పుడు విధిగా మీ యొక్క ఆధార్, పట్టాదారు పాసుబుక్కు జిరాక్స్ తీసుకొని కావాలని కోరారు.
- Advertisement -