- Advertisement -
నవతెలంగాణ – మోపాల్ : మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామానికి చెందిన మధ్గి ఎల్లయ్య సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 39 గంటల భూమి సర్వేనెంబర్. 62/ఆ/ఊ ఉందని, తన తండ్రి బ్రతికున్నప్పుడు వ్యవసాయం చేసేవాడని, దాని పక్కనే ఉన్న రైతులు దానిని కబ్జా చేశారని తెలిపారు. దయచేసి నా భూమి ఆక్రమణకు గురి కాకుడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించాడు. ఇప్పటికైనా హద్దులు పెట్టి తన భూమి తనకు వచ్చేలా చూడాలని నవతెలంగాణ ద్వారా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ ను వేడుకున్నారు.
- Advertisement -