Monday, July 7, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. శనివారం జన్నారంలో మహిళా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షురాలిగా పర్ల సరోజ, ప్రధాన కార్యదర్శిగా పిల్లి సుజాత, సభ్యులుగా సుమలత, పోతు అనిత, కే.సుమలత, ఎం. రాజేశ్వరి, వరలక్ష్మి ఎన్నికయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తేనే తమ హక్కులను సాధించుకోవచ్చు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెరిస్తున్నామన్నారు కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కడార్ల నరసయ్య రవి ముదిరాజ్ పర్ల కనకయ్య తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -