Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదిగలు ఐకమత్యంగా కలిసి పనిచేయాలి

మాదిగలు ఐకమత్యంగా కలిసి పనిచేయాలి

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో గత 30 ఏళ్లుగా చేసిన పోరాటాలు ఉద్యమాలు, అమరుల త్యాగాల మూలంగా ఎబిసి వర్గీకరణ సాధించామని ఎమ్మార్పిఎస్ జిల్లా అధ్యక్షులు పడిదల రవికుమార్ అన్నారు. సోమవారం ‌ఎమ్మార్పీఎస్ 30 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ వద్ద ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగలకు ఏబీసీ వర్గీకరణ చేయడం హర్షణీయమని అన్నారు.ఏ బి సి వర్గీకరణ ద్వారా రాజకీయంగా,ఉద్యోగ పరంగా, విద్యాపరంగా జనాభా ప్రాతిపదికను మాదిగలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. 30 ఏళ్ల పోరాటంలో మాదిగలు అనేక రకాలుగా ఉద్యమాలు చేశారని, అందరూ ఐకమత్యంతో కలిసి పోరాటం చేయడం ద్వారానే ఏబీసీ వర్గీకరణ సాధించడం జరిగిందని ఇలాగే భవిష్యత్తులో కూడా అందరూ ఐక్యంగా ఉండి మాదిగల హక్కుల సాధన కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుక జానయ్య,నియోజకవర్గం ఇంఛార్జ్ చింత సైదులు, మొండికత్తి లింగయ్య, బొడ్ల పరశురాం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు,, గుడిపూరి ఉపేందర్, పడిదల శ్రవణ్, వెంకటేష్, బొజ్జ నాని, వల్దాసు సాయి, సాగంటి మురారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -