Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ యూనివర్సిటీ ప్రవేశాల కొరకు నోటిఫికేషన్

అంబేద్కర్ యూనివర్సిటీ ప్రవేశాల కొరకు నోటిఫికేషన్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025-26 సంవత్సరానికి డిగ్రీ కోర్సుల ప్రవేశానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కో- ఆర్డినేటర్ డాక్టర్ గంజి రమేష్ సోమవారం ఓక ప్రకటనలో  కోరారు.  ఆగస్టు 13 లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే డిగ్రీ సెకండ్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క ట్యూషన్ ఫీజు చెల్లించడానికి ఆగస్టు 13 వరకు చివరి అవకాశం ఉందని,  మరింత సమాచారం కొరకు స్టడీ సెంటర్  ఇంచార్జీ  బొజ్జ బాలయ్య సెల్ నంబర్ 9000 590545 ను సంప్రదించాలని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -