Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇస్తుంది: కలెక్టర్

ప్రభుత్వ మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇస్తుంది: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో అధిక ప్రాధాన్యత ఇస్తుందని  వాటిని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రోజు భువనగిరి జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యుల సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా  హాజరై మాట్లాడారు. 

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని , కోటి మంది మహిళలు కోటీశ్వరులలుగా చేయాలన్న సంకల్పంతో స్వయం సహాయక సంఘాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు.స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలను అందిస్తూ వివిధ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన మహిళలను ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని అన్ని సంఘాల మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జిల్లాలో కలెక్టరేట్   ప్రాంగణంలో మహిళల బలోపేతానికి నూతన మహిళ సమాఖ్య భవనం కూడా నిర్మిస్తునామన్నారు.  మహిళా సంఘాల సభ్యులు ఈ సంబురాలను గ్రామలలో మహిళలకు వివరంగా వివరించాలన్నారు. 

గత సంవత్సరం మన మహిళా సంఘాల రుణాలు తీసుకోవడం  మన జిల్లా టాప్ లో ఉందన్నారు.  మీ గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చి కట్టుకోలేని పరిస్థితి ఉన్న పేదలకి  మహిళా సంఘాల తరుపున రుణాలు ఇప్పించి ఇళ్లు కట్టుకునే చిరకాల కోరికను నెరవేర్చాలన్నారు. త్వరలో మహిళా శక్తి కింద పెట్రోల్ బంకులు ఇస్తామన్నారు.  బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను వృధా చేయకుండా వినూత్నంగా ఆలోచించి  చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మంచి లాభాలు పొందాలని కలెక్టర్  సూచించారు.

వన మహోత్సవంలో బాగంగా  మండలం జిల్లా సమాఖ్య కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు మొక్క నాటి నీరు పోశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో బాగంగా ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా  మొక్కలు నాటడం ద్వారా వృక్షసంపద పెరుగుతుందని, మానవ మనుగడకు మొక్కలు ప్రాణాధారం అని జిల్లా కలెక్టర్  సందేశాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి,జిల్లా విజిలెన్స్ అధికారి ఉపేందర్ రెడ్డి, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్ ,  యం.పి.డి.ఓ శ్రీనివాస్ ,యం.పి.ఓ దినకర్, ఏ.పి.ఓ బాలస్వామి, జిల్లా సమాఖ్య కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -