ఆర్డిఓ రాజేంద్ర కుమార్..
నవతెలంగాణ – డిచ్ పల్లి : ఓటర్ నమోదు లో ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే దానిని సరి చేసుకోవడానికి అవకాశం ఉందని, దీనిని బూత్ లెవెల్ అధికారులు సరి చేసే విధంగా చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ రాజేంద్ర కుమార్ సూచించారు. సోమవారం ఇందల్ వాయి తాహసిల్దార్ కార్యాలయంలో ఓటర్ నమోదు బూత్ స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆర్డిఓ రాజేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఫామ్ 6,7,8, నింపుకొని బూత్ లెవెల్ అధికారి యాప్ లో నమోదు చేయాలన్నారు. ఏమైనా చేర్పులు, మార్పులు ఉన్నచో బిఎల్ఓ లు సరి చేసే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వెంకట్ రావు, డిప్యూటీ తహసిల్దార్ అశ్వక్ అహ్మద్, శైలజా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మోహన్ తోపాటు కార్యాలయ సిబ్బంది, బి ఎల్ ఓ లు పాల్గొన్నారు.
ఓటర్ నమోదు సరి చేసుకోవడానికి అవకాశం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES