Tuesday, July 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకలెక్టరేట్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రైతు..

కలెక్టరేట్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రైతు..

- Advertisement -


నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ఓ రైతు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి, విసుకు చెంది, చేసేదేమీ లేక ఏమీ తోయని పరిస్థితిలో కలెక్టర్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసన వ్యక్తం చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యాప్రాల్ గ్రామానికి చెందిన అగ్గి రెడ్డి అనే వ్యక్తి 2005 సంవత్సరంలో బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో తడకపల్లి అగ్గిరెడ్డి అనే వ్యక్తి వద్ద 340,345,346 సర్వే నెంబర్లలో సుమారు రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాస్ బుక్కులను జారీ చేసింది. కానీ ఆ సమయంలోనే ధరణి చట్టాన్ని తీసుకొచ్చింది.

అప్పటినుంచి ఇప్పటివరకు తాను కొనుగోలు చేసిన భూమి ధరణిలో ఎక్కించకపోవడంతో పాస్ బుక్కులు రాలేదు. కాగా తమ పేరు మీదన ఉన్న భూమిని సింగిరెడ్డి మహిపాల్ రెడ్డి అనే వ్యక్తికి రికార్డు మార్చి, పట్టా చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారులు, కలెక్టర్ కు విన్నవించినప్పటికీ, న్యాయం జరగకపోవడంతో మనస్థాపానికి గురై భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి జరుగుతున్న సమయంలో తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసన వ్యక్తం చేశాడు.

దీంతో వెంటనే పోలీసులు స్పందించి, అతన్ని సముదాయించారు. ఏం జరిగిందని కలెక్టర్ విషయం ఆరా తీశారు. అప్పుడు విషయమంతా చెప్పి, నాకు అన్యాయం జరిగిందని వాపోయాడు. నా ప్రమేయం లేకుండా ఇతరుల పేరు మీద తమ భూమిని ఎలా రిజిస్టర్ చేస్తారని అధికారులను నిలదీశారు. ఇకనైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -