హైదరాబాద్, ఇండియా 2025: యుఎస్ లో ప్రధాన కార్యాలయం కలిగిన టెక్నాలజీ కన్సల్టింగ్ , ఉత్పత్తి అభివృద్ధి సంస్థ అయిన అలెక్టా సొల్యూషన్స్, హైదరాబాద్‌లోని అవ్యయ్ బాంకెట్స్‌లో జరిగిన ప్రత్యేకమైన ‘పినాకా స్టెల్లార్’ ప్రీ-లాంచ్ వేడుకల కార్యక్రమంలో దాని ప్రధాన సాస్ ప్లాట్‌ఫామ్ పినాకా ను విడుదల చేయటం ద్వారా దాని ప్రపంచ విస్తరణ వ్యూహంలో ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంది.
2016లో అనుభవజ్ఞుడైన టెక్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రావణ్ బెలే (వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అలెక్టా సొల్యూషన్) ప్రారంభించిన అలెక్టా సొల్యూషన్స్, యుఎస్ లో విస్తృత స్థాయిలో కార్యకలాపాలను నిర్వహిస్తుండటంతో పాటుగా ఆసియాలో అభివృద్ధి చెందుతున్న కార్యకలాపాలతో, భావితరపు ఆలోచనలు కలిగిన సాంకేతిక భాగస్వామిగా వేగంగా వృద్ధి చెందింది. కంపెనీ యొక్క తాజా ఆవిష్కరణ, పినాకా, సాంకేతికత ఆధారిత పరివర్తన ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలను శక్తివంతం చేయడంలో వ్యూహాత్మక ముందడుగును సూచిస్తుంది.
పినాకా అనేది తదుపరి తరం, ఏఐ -ఆధారిత సాస్ ప్లాట్‌ఫామ్, ఇది ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్ పి), పాయింట్ ఆఫ్ సేల్ (పిఓఎస్) , ఫిన్‌టెక్ సొల్యూషన్స్ మరియు ఏఐ -ఆధారిత వ్యాపార మేధస్సును సజావుగా అనుసంధానిస్తుంది. వ్యాపార సంస్థల యజమానులు , వాణిజ్య సంస్థల ప్రతినిధులకు ఏకీకృత నియంత్రణ, కార్యాచరణ సామర్థ్యం , రియల్-టైమ్ పరిజ్ఞానం అందించడానికి రూపొందించబడిన పినాకా, రిటైల్, హాస్పిటాలిటీ సహా విభిన్న రంగాలకు సేవలను అందించటానికి సిద్ధంగా ఉంది.
ఈ కార్యక్రమంలో శ్రావణ్ కుమార్ బెలే మాట్లాడుతూ, ” తెలివైన, వ్యాప్తి చేయతగిన మరియు ప్రపంచవ్యాప్తంగా అనుకూలీకరించదగిన పరిష్కారాలను అందించాలనే మా లక్ష్యం ను పినాకా ప్రతిబింబిస్తుంది. ఈ ఆవిష్కరణతో , మేము భౌగోళిక ప్రాంతాలలో వ్యాపారాల కోసం కార్యాచరణ సామర్థ్యం , వ్యూహాత్మక వృద్ధికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాము” అని నొక్కి చెప్పారు.
అలెక్టా సొల్యూషన్స్ ఇప్పటికే దాని భారతీయ కార్యకలాపాలు , ఉత్పత్తి అభివృద్ధిలో దాదాపు $1 మిలియన్ యుఎస్ డి పెట్టుబడి పెట్టింది, రాబోయే మూడు సంవత్సరాలలో అదనంగా $6 మిలియన్ యుఎస్ డి పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు చేసింది. ఈ వృద్ధి రోడ్‌మ్యాప్ భారతదేశం అంతటా ఐటి , హాస్పిటాలిటీ మరియు రియల్ ఎస్టేట్ రంగాలలో విస్తరించడంపై దృష్టి పెడుతుంది.
ఆసియా పసిఫిక్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాత్మక చర్యలో భాగంగా, అలెక్టా,ఏపిఏసి కోసం అఫ్లుయెన్స్ కన్సల్టింగ్‌తో ప్రత్యేక సేవా భాగస్వామిగా ఒప్పందం కుదుర్చుకుంది, ఇది భారతదేశం, సింగపూర్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లలో భవిష్యత్తులో విస్తరణలకు మార్గం సుగమం చేసింది.
‘పినాకా స్టెల్లార్’ కార్యక్రమంలో ప్లాట్‌ఫామ్ యొక్క ప్రత్యక్ష ప్రదర్శన, అలెక్టా నాయకత్వంతో కీలక సెషన్‌లు మరియు ప్రపంచ భాగస్వాములు , వ్యాపార నాయకులతో చర్చలు జరిగాయి. సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో డిన్నర్, ప్రత్యేక ప్రదర్శనలు మరియు ప్రత్యక్ష సంగీత కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా విశిష్ట అతిథులు హాజర్యయారు.
అలెక్టా సొల్యూషన్స్ గురించి
2016లో కార్యకలాపాలను ప్రారంభించిన, అరిజోనాలోని ఫీనిక్స్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన అలెక్టా సొల్యూషన్స్, ప్రపంచ లక్ష్యాలకు అనుగుణంగా ఐటి కన్సల్టింగ్ మరియు ఉత్పత్తి అభివృద్ధిలో ప్రత్యేకత కలిగి ఉంది. ఆవిష్కరణ , వృద్ధిపై బలమైన లక్ష్యంతో, కంపెనీ వ్యాపార పరివర్తనను నడిపించే తదుపరి తరం సాంకేతిక పరిష్కారాలను అందిస్తూనే ఉంది.