Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్ : కుటుంబ కలహాలతో జీవితం మీద విరక్తి చెంది, ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బేగంపేట పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన మొహమ్మద్ షాదుల్లా (36) టైల్స్ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. షాదుల్లాకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
వారి కుటుంబంలో జరిగిన కలహాలతో తీవ్ర మనస్తాపం చెంది జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి 11:00 గంటలకు వారి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అనంతరం గమనించిన కుటుంబ సభ్యులు చూసేసరికి షాదుల్లా మృతి చెందాడు. ఇట్టి విషయం పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి మొహమ్మద్ రాజంబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బేగుంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -