నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్: పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ, కుంట్లూర్ పరిధిలోని రావినారాయణ రెడ్డి కాలనీ ఫేస్ -3 లోని గుడిసెల్లో ఆకస్మికంగా మంటలు చెలరేగి సుమారుగా 200 గుడిసెలు కాలి బూడిదయ్యాయని, వారిని ఆడుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి సీపీఐ నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రావినారాయణ రెడ్డి కాలనీలో నివాసం ఉండే పేదలు ఈ నెల 26 న రోజువారి కూలీ పనులకు వెళ్లిన తర్వాత వారు నివాసం ఉండే గుడిసెలు మంటలు అంటుకొని కాలిపోయాయని అన్నారు. దింతో అక్కడ నివాసం ఉండే వారు సర్వం కోల్పోయారని, తక్షణమే వారికి లక్ష రూపాయల నష్ట పరిహారం, నివాసయోగ్యత కోసం విద్యుత్ మంచి నీరు సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఐ రాష్ట్ర నాయకులు ఆందోజు రవీంద్ర చారి, ముత్యాల యాదిరెడ్డి,స్థానిక నాయకులు సామిడి శేఖర్ రెడ్డి, పబ్బతి లక్ష్మణ్, అజ్మీర్ హరిసింగ్ నాయక్, కేతరాజు నర్సింహా, పొన్నాల యాదగిరి, అరుణ,నవనిత మధు, సకృ నాయక్, సైదులు, నిరంజన్, నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు
గుడిసెవాసులను ఆదుకోవాలని కలెక్టర్ కు వినతి
- Advertisement -
RELATED ARTICLES