Tuesday, July 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసార్వత్రిక సమ్మెలో యూనియన్లకు ఆతీతంగా పాల్గొందాం

సార్వత్రిక సమ్మెలో యూనియన్లకు ఆతీతంగా పాల్గొందాం

- Advertisement -

– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలను నిరసిస్తూ జులై 9న చేపట్టిన దేశవ్యాప్త సమ్మేలో యూనియన్లకతీతంగా పాల్గొనాలని కార్మిక వర్గానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని బీడీఎల్‌లో జరిగిన గేట్‌ మీటింగ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో 2014 నుంచి 2025 వరకు పదేండ్ల కాలంలో రూ.4 లక్షల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను విక్రయించిందని విమర్శించారు. బీఈఎల్‌లో 47, మిథానిలో 26, బీడీఎల్‌లో 25, బీహెచ్‌ఐఎల్‌లో37, హెచ్‌ఎల్‌ 25 శాతం చొప్పున వాటాలను విక్రయించారని ఆందోళన వ్యక్తం చేశారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు అనుబంధంగా ఉన్న డోలమైట్‌ (క్యాస్టివ్‌ మైన్‌)లో సైతం ఎఫ్‌ఐ ప్రవేశపెట్టాలనే కేంద్ర ప్రభుత్వ యోచనను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. గత 20 ఏండ్లుగా లాభాలు గడిస్తూ, అవార్డులు అందుకుంటున్న సింగరేణి సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. సంగారెడ్డి బీడీఎల్‌లో జరిగిన గేట్‌ మీటింగ్‌లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వేంకటేశ్‌ పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తున్నదని విమర్శించారు. రైల్వే, రోడ్‌, ఎయిర్వేస్‌, డాక్‌- పోర్టులు, టెలికం తదితర మౌలిక రంగాల్లో ‘నేషనల్‌ ఎస్సెట్‌ మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌’ పేరుతో లక్షల ఎకరాల భూములను కార్పొరేట్‌ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ బీడీయూ నాయకులు మురళి, సత్తయ్య, ఎం. రవీందర్‌, దానకర్ణాచారి, ఎన్‌. శ్రీధర్‌, వినోద్‌, బీఆర్‌టీయూ నాయకులు వర్మ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -