– ఒకే కుటుంబంలో నలుగురు సజీవదహనం
– మృతులంతా హైదరాబాదీలు
డల్లాస్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన కుటుంబంలోని నలుగురు సజీవదహనమయ్యారు. రాంగ్ రూట్‌లో వచ్చిన మినీ ట్రక్కు, కారును ఢకొీనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని సుచిత్రలో నివాసం ఉండే తేజస్విని, శ్రీవెంకట్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి సెలవుల్లో సరదాగా గడిపేందుకు డల్లాస్‌కు వెళ్లారు. సెలవులు ఉండటంతో అట్లాంటాలోని తమ బంధువుల ఇంటికి కారులో వెళ్లి, డల్లాస్‌కు తిరిగి వస్తుండగా గ్రీన్‌కౌంటీ వద్ద రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ మినీ ట్రక్కు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢకొీట్టింది. దీనితో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆ కుటుంబంలోని నలుగురూ సజీవదహనమై ప్రాణాలు కోల్పోయారు. కారు పూర్తిగా మంటల్లో కాలి బూడిద అయ్యింది. డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరించి మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని అక్కడి పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన గురించి తెలిసి శ్రీవెంకట్ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES