Tuesday, July 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -

8న గ్రామాలు, 9న మండల, జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు : ఎస్కేఎం రాష్ట్ర కమిటీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 9న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ల్లు టి.సాగర్‌, జక్కుల వెంకటయ్య, డిజి.నరేంద్ర ప్రసాద్‌, ఆర్‌.వెంకట్రాములు, ఇ.విజరు మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఈనెల 8న గ్రామీణ ప్రాంతాల్లో, 9న మండల, జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని కోరారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్లుగా తీసుకు రావడం ద్వారా కార్మికులకు మోడీ సర్కార్‌ తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. 13 నెలల పాటు రైతులు చేసిన పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్‌ విధాన ముసాయిదా పత్రంతో రద్దుచేసిన మూడు చట్టాలను దొడ్డి దారిన తెచ్చేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని వారు విమర్శించారు. విద్యుత్‌ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనీ, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. బడా కార్పొరేట్‌ సంస్థలకు రూ. లక్షల కోట్లు మాఫీ చేస్తున్న మోడీ ప్రభుత్వం, రైతులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల ఆదా యం రెట్టింపు చేస్తామనీ, స్వామినాథన్‌ కమిటీ సిఫారులను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉపాధి కూలీలకు ఏడాదికి 200 రోజుల పని దినాలు కల్పించాలని కోరుతుంటే, ఆ చట్టానికి బడ్జెట్లో కేంద్రం నిధులు తగ్గిం చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, నాయకులు శివ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -