Wednesday, April 30, 2025
Homeజిల్లాలుఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించిన డిప్యూటీ ఆర్ఎం సుచరిత…

ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించిన డిప్యూటీ ఆర్ఎం సుచరిత…

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : నూతనంగా డిప్యూటీ ఆర్ఎంగా భాద్యతలు తీసుకొన్న సుచరిత, మంగళవారం యాదగిరిగుట్ట వెళుతూ మార్గమధ్యంలోని భువనగిరి బస్ స్టేషన్ ను సందర్శించారు. ప్రయాణికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.  ముఖ్యంగా  గజ్వేల్ ప్లాట్ ఫాం పక్కన గల మహిళల టాయ్లెట్స్ కు వెళ్ళే  దారిని వెంటనే మరమ్మతులు చేయించాలని , బస్టాండ్ లోని వాటర్ ట్యాంక్ ను  వెంటనే శుభ్రం చేయాలని స్టేషన్ మేనేజర్ వెంకటయ్య ను ఆదేశించారు. బస్టాండ్ లోని పలు దుకాణాలు సందర్శించి ఎం ఆర్ పి కంటే ఎక్కువ ధరకు అమ్మ రాదని అన్నారు. బస్టాండ్ లో ఉన్న క్యాంటీన్ లో కూరగాయలను శుభ్రంగా కడిగి వండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హోటల్ యాజమాన్యంను ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల కొరతను , ప్రయాణికుల సమస్యలను, టాయ్లేట్ల పరిశుభ్రత గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్టీసీ బస్ స్టేషన్ మేనేజర్ వెంకటయ్య, కంట్రోలర్ సోమరాజు, యాదగిరిగుట్ట టిఐ- 2 శ్రీనివాస్, మణికంఠ, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ లు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img