నవతెలంగాణ-పెద్దవూర
ప్రభుత్వ పాఠశాలల్లో నే నాణ్యమైన విద్యను అందిస్తున్నారని మండల అభివృద్ధి అధికారి ఉమాదేవీ అన్నారు.మంగళవారం మండల పరిధిలోని పోతునూరు ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె పాఠశాల రికార్థులు, మధ్యాహ్నం భోజనం స్థితిగతులు, పరిసరాలు, తరగతి గదులు, వంట గదిని పరిశీలించి మధ్యాహ్న భోజన తయారు చేసే కార్మికులకు తగు సలహాలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనంతో పాటు వారానికి మూడు గుడ్లు విద్యార్థులకు అందించాలని కోరారు. అదేవిధంగా తరగతిలో విద్యార్థుల్ని విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యకం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో అందించే నాణ్యమైన విద్యను అందుకొని ఉన్నత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రామ్ నాయక్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రామ్మూర్తి, మెహజాభీ, అంజాద్, అంజూమ్, ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES