Wednesday, July 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

- Advertisement -

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్..
నవతెలంగాణ – జన్నారం
: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉదయం జన్నారం మండల కేంద్రంలో పొద్దు పొడుపు- బొజ్జన్న అడుగు (మార్నింగ్ వాక్) కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని,ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

గ్రామాలను అన్ని విధాలుగా సుందరంగా తీర్చిదిద్దేందుకు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగు నీరు అందించేందుకు బోర్లు వేశామని తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చామని, ఇండ్లు రాని పేదలకు 2వ విడతలో ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్  దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ పసియుల్లా పార్టీ అధ్యక్షులు ముజాఫర్ అలీ ఖాన్ ప్రధాన కార్యదర్శి మాణిక్యం పిఎసిఎస్ చైర్మన్ అల్లం రవి గుర్రం మోహన్ రెడ్డి, మహమ్మద్ రియాజుద్దీన్ మామిడిపల్లి ఇందయ్య నందు నాయక్, ఇసాక్ దూమల్ల రమేష్, గంగన్న యాదవ్ రాజన్న యాదవ్  సుధాకర్ నాయక్, సోహెల్షా, అజ్మత్ ఖాన్, మంద రాజేష్, మహమ్మద్ అజారుద్దీన్, నర్సింగారావు, తదితర కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -