Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీఆర్ఎస్‌పై ఎంపీ చామల ఫైర్..

బీఆర్ఎస్‌పై ఎంపీ చామల ఫైర్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణలో బీఆర్ఎస్ బిహార్ సంస్కృతి తరహా దాడులకు తెరలేపుతోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రముఖ మీడియా సంస్థ పై దాడులు చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదిక ఓ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ నుంచి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసేందుకు గులాబీ పార్టీ ప్రయత్నం చేస్తోందని అన్నారు.

తెలంగాణ అంటే బీఆర్ఎస్ అనే విధంగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని కామెంట్ చేశారు. ఆ పార్టీకి అనుకూలంగా ఉంటే తెలంగాణ మీడియా అంటున్నారని, లేకపోతే అది ఆంధ్రా మీడియా అయిపోతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మీద ఉన్న కోపాన్ని టీవీ ఛానెళ్ల మీద చూపిస్తే ఎలా అని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో చేసిన తప్పులను టీవీ ఛానెళ్లు ప్రసారం చేయోద్దంటే అది కుదరని పని కదా అని  సెటైర్లు వేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -