Wednesday, July 9, 2025
E-PAPER
Homeకరీంనగర్నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

- Advertisement -

రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను వాడాలి
మిశ్రమ పంటలు, పంట మార్పిడితో రైతుకు అధిక దిగుబడి
మండల వ్యవసాయ అధికారి ముప్పిడి సూర్యనారాయణ

నవతెలంగాణ – జమ్మికుంట: నకిలీ విత్తనాలు పెస్టిసైడ్స్ అమ్మితే రైతులు తన దృష్టికి తీసుకు వచ్చినట్లయితే అట్టి షాపు సీజ్ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లందకుంట మండల వ్యవసాయ అధికారి ముప్పిడి సూర్యనారాయణ తెలిపారు. ప్రతి వారము ఫెర్టిలైజర్ షాప్ లను తనిఖీ చేస్తున్నామన్నారు. అధిక రేట్లకు విత్తనాలను పెస్టిసైడ్స్ ను అమ్మితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. మిశ్రమ పంటలు, పంట మార్పిడితో రైతుకు అధిక దిగుబడితో పాటు భూసారము పెరుగుతుందన్నారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇల్లందకుంట మండల వ్యవసాయ అధికారి ముప్పిడి సూర్యనారాయణతో నవతెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ.

నవతెలంగాణ : మండలంలోని రైతుల సంఖ్య ఎంత?
ఏవో: 12000 మంది రైతులు ఉన్నారు.

నవతెలంగాణ :మండలంలో సాగు విస్తీర్ణం, ఏ యే పంటలు సాగు చేస్తున్నారు?
ఏవో : ఇల్లందకుంట మండలంలో 20 వేల ఎకరాలు సాగు విస్తీర్ణంలో ఉంది. పత్తి 7500 ఎకరాలు, వరి 12,000 ఎకరాల్లో, 5 00 ఎకరాలలో ఇతర పంటలు  మిర్చి, పామ్ ఆయిల్, మొక్కజొన్న, కూరగాయలు, సాగుకు సన్నద్ధం అవుతుంది.

నవతెలంగాణ: సబ్సిడీ విత్తనాలు?
ఏవో: 60 శాతం సబ్సిడీ పై జీలుగా విత్తనాలు పంపిణీ చేసాము.

నవతెలంగాణ: రైతు రుణమాఫీ?
ఏవో: మండలంలో 3400 మందికి రైతులు రుణమాఫీ కావడం జరిగింది. వారికి సుమారు 35 కోట్ల వరకు రుణమాఫీ కావడం జరిగింది.

నవతెలంగాణ: ఎరువుల కొరత ఉందా?
ఏవో: రైతులకు సరిపడా ఎరువుల కొరకుప్రణాళిక సిద్ధం చేసి  ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది.  ప్రస్తుతానికి 30 శాతం యూరియా  కొరత ఉంది.

నవతెలంగాణ: రైతు బీమా ఎంతమందికి ఇచ్చారు?
ఏవో: 2024 -25 సంవత్సరంలో 30 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున రైతు బీమా అందించడం జరిగింది. ఇంకా ఐదుగురికి రావలసి ఉంది.

నవతెలంగాణ: రైతు భరోసా గురించి?
ఏవో: 10880 మందికి రైతు భరోసా వచ్చింది.11 కోట్ల 44 లక్షల 14 వేల రూపాయలు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది.

నవతెలంగాణ: భూసార పరీక్షలు చేస్తున్నారా?
ఏవో: ప్రస్తుతానికి ఆ స్కీం లేదు. 2018 వరకు భూసార పరీక్షలు చేశాము. ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడం జరిగింది .ఆ గ్రామంలో భూసార పరీక్షలను చేస్తున్నాము.

నవతెలంగాణ: మండలంలో ఎన్ని ఫెర్టిలైజర్ షాపులు ఉన్నాయి .నకిలీ విత్తనాలు ,పెస్టిసైడ్స్ నివారణకు చర్యలు
ఏవో: లైసెన్స్ ఉన్నవి 20ఉన్నాయి.  నకిలీ విత్తనాలు అమ్మడం లేదు. నివారణ చర్యలు తీసుకుంటున్నాము. విత్తనాల కొరత లేదు. విత్తనాలను అధిక రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాము.  పెస్టిసైడ్స్ విక్రయాలు ఇంకా మొదలు కాలేదు.

నవతెలంగాణ: ఏ ఈ ఓ లు క్షేత్రస్థాయిలో రైతులను కలుస్తున్నారా?
ఏవో: ఐదుగురు ఏ ఈ ఓ లు ఉన్నారు. నిత్యము రైతులతోనే ఉండి వారి నుండి సమాచారాన్ని సేకరించి డిజిటల్ పద్ధతి ద్వారా ప్రభుత్వానికి పంపిస్తున్నాము. ప్రతి సోమవారము ఐదు షాపులను తనిఖీ చేస్తున్నారు. ఏ ఈ ఓ ల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ లో జిల్లాలోనే ఇల్లందకుంట మండలం రెండవ స్థానంలో ఉంది.

నవతెలంగాణ : మిశ్రమ పంటలు, పంట మార్పిడి గురించి అవగాహన కార్యక్రమాలు?
ఏవో : ఆయిల్ ఫామ్ లో మాత్రమే మిశ్రమ పంటలు వేస్తున్నారు. నీటి ఎద్దడి లేదు కాబట్టి మిశ్రమ పంటలు ఎక్కడ వేయడం లేదు. పంట మార్పిడి గురించి రైతులకు  అవగాహన కల్పిస్తున్నాము.

నవతెలంగాణ: సేంద్రియ, స్వభావిక ఎరువుల గురించి అవగాహన?
ఏవో: రసాయనిక ఎరువులు అధికంగా వాడితే భూసారము తగ్గిపోతుంది. సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పిస్తున్నాము. జీలుగా పచ్చి రొట్టెను రైతులు ముందుగా వేసిన తర్వాత కర్బనము, భూసారము పెరుగుతుంది. ఆ తర్వాతనే పంటలు వేయాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -