Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి: డా. సురేష్ 

నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి: డా. సురేష్ 

- Advertisement -

ఇంటింటి అవగాహనలో ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ
నవతెలంగాణ – రామారెడ్డి 
: వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని, సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రామారెడ్డి పి హెచ్ సి వైద్యులు సురేష్ ప్రజలకు మంగళవారం సూచించారు. మండల కేంద్రంలో ప్రత్యేక అధికారి సంజయ్ కుమార్, ఎంపీడీవో తిరుపతిరెడ్డితో కలిసి రామారెడ్డి సబ్ సెంటర్ పరిధిలో ఇంటింటి సర్వే, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. చుట్టుపక్కల వర్షానికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీరు దీనివల్ల దోమలు వృద్ధి చెంది మలేరియా, వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు. ముందు జాగ్రత్తగా పరిసర ప్రాంతాలలో ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ ను చల్లాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని, నీటిని కాల్చి చల్లార్చి త్రాగాలని సూచించారు. జ్వరం అధికంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి క్రాంతి, జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్, ఏఎన్ఎం మహేశ్వరి, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -