Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి మహిళను సంబరాలలో భాగస్వామ్యం చేయాలి

ప్రతి మహిళను సంబరాలలో భాగస్వామ్యం చేయాలి

- Advertisement -

– వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య
– మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది 
– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి  : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో  భాగంగా మండల పరిధిలో ఉన్న ప్రతి ఒక్క మహిళను భాగస్వామ్యం చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐకెపి శిక్షణ కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాల ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మహిళలను ఉద్దేశించి మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. ఇందులో భాగంగా భారీ స్థాయిలో మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇవ్వడంతో పాటు వడ్డీ రాయితీ సైతం మంజూరు చేస్తుందని తెలిపారు.

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, మహిళా సమాఖ్యల చేత పెట్రోల్ బంకుల ఏర్పాటు, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా యూనిఫామ్ తయారీ పాఠశాల మరమ్మత్తుల వంటి కార్యక్రమాలను కూడా చేపడుతుందని వివరించారు. గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఐకెపి సంఘాల్లో చేరాలని తద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకాలను ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను రూపొందిస్తుందని, భవిష్యత్తులో మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంపొందించేందుకు ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఐకెపి ద్వారా అందించిన రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, ఇంటి నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.

తహసిల్దార్ గుడిమెల ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆదాయాన్ని పెంపొందించే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఊరురా నిర్వహించేందుకు ముందుకు రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అందిస్తున్న అన్ని పథకాలను మహిళల పేరు మీదనే ఇస్తోందని, మహిళల పేరుపై పథకాలు మంజూరు చేయడం ద్వారా అవి దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవుతాయన్నారు.మహిళా శక్తి సంబరాల యొక్క ఉద్దేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలని తహసిల్దార్ పిలుపునిచ్చారు.ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుందని, తద్వారా ఊరంతా బాగుంటుందన్నారు.

ప్రతి ఒక్క మహిళ గ్రామాల్లో పారిశుద్ధ్య పరిరక్షణకు కృషి చేయాలని, స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. వనమహోత్సవం కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క మహిళను ఐకెపి సంఘంలో చేర్పించాలని, ఇందుకు ఈనెల 16వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని ఐకెపి ఎపిఎం  కుంట గంగాధర్  సిబ్బందికి సూచించారు. ఈ సంబరాల కాలంలోనే అర్హత ఉన్న అన్ని సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందజేయాలన్నారు.ఈ సందర్భంగా ఐకెపి కార్యాలయాన్ని, సమావేశ మందిరాన్ని ముగ్గులు, రంగురంగుల పుష్పాలు, బెలూన్లు తో అందంగా అలంకరించి సంబరాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కమల, కార్యదర్శి వాసవి, కోశాధికారి రోజా రాణి, ఉపాధ్యక్షురాలు, సహాయ కార్యదర్శి, సిసిలు వర్ణం శ్రీనివాస్, నవీన్ కుమార్, భాగ్యలక్ష్మి, అలేఖ్య, సిబ్బంది అనసూయ, ధనలక్ష్మి, సత్తెమ్మ, గ్రామ సమాఖ్యల ప్రతినిధులు, వివోఏలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -