నవతెలంగాణ – ఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంయుక్తంగా ఈ లేఖను పంపారు. పహల్గామ్ దాడి పరిణామాలపై చర్చించేందుకు వీలైనంత త్వరగా పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు తమ లేఖలో ప్రధానిని కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యావత్తూ ఐక్యంగా నిలుస్తుందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి అందించాల్సిన అవసరం ఉందని రాహుల్, ఖర్గే తమ లేఖలో నొక్కి చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి సభ నివాళులర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలపై పార్లమెంట్ వేదికగా సమగ్రంగా చర్చించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోడీకి లేఖ రాసిన రాహుల్ గాంధీ
- Advertisement -
RELATED ARTICLES