నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు సోహం అకాడమీ, ఎల్ అండ్ టి ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ రోబోటిక్స్ పై 50 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ అనంతరం ఎంపిక చేసిన 20 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేశారు. ఎంపికైన విద్యార్థులు రానున్న రోజుల్లో సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం వంటి చాలెంజెస్ ఉంటాయని వీటిని సకాలంలో పూర్తి చేయాలని, సోహం అకాడమీ మెంటర్ వర్షిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలు తెలిపారు. విద్యార్థులకు బేసిక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఆడ్రినో బోర్డు, వివిధ రకాల సెన్సార్లు పనిచేసే విధానం పై 21 కృత్యాలు చేయించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సుజాత, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్చార్జ్ రాజు, సైన్స్ ఉపాధ్యాయులు సరిత, వృత్తి విద్యా శిక్షకులు ప్రసన్న, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు రోబోటిక్స్ పై శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES