Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలు..

ఘనంగా ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి మహిళా శక్తి భవనంలో మంగళవారం మహిళా సమాఖ్య , ఐకేపీ ఏపీఎం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇందిరాగా మహిళా శక్తి సంబరాలు ఉన్నత అధికారులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రాష్ట్రస్థాయి నుంచి మొదలుకొని గ్రామ స్థాయి వరకు జరపాలని చెప్పి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్నారు. మహిళలకు ఇస్తున్న పథకాలు 1. వడ్డీ లేని రుణాలు 2. లోన్ బీమా, ప్రమాద బీమా రూ.10 లక్షల వరకు, ఇది కేవలం సంఘంలో ఉన్న సభ్యురాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. డైరీ, లోన్స్, కోళ్ల పెంపకం, ఎంటర్ప్రైజెస్, సంఘంలో లేని సభ్యులను సంఘంలో చేర్పించడం, పెట్రోల్ బంకులు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలలో కమిటీ చైర్మన్గా పదవిలో స్కూల్ యూనిఫార్మ్స్ కుట్టించడము, మహిళా శక్తి క్యాంటీన్లు, మదర్ యూనిట్ కోళ్లకు సంబంధించిన యూనిట్స్, స్త్రీ నిధి రుణాలు, బ్యాంకు రుణాలను పురస్కరించానుకొని ఈ కార్యక్రమాలు చేశారు.

ఇందులో భాగంగా స్కూల్ మామ్స్, స్కూల్ యూనిఫాంను కుట్టిన, శివ లీల ఆయిల్ మిల్లులో ప్రతిభ కనబరిచిన, పార్వతీ భాయ్ అమ్మ ఆదర్శ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన, వజ్రకండి ఉమాదేవి కొనుగోలు కేంద్రం కమిటీ మెంబర్ గా శాంతావ్వలను సన్మానించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్, ఐకేపీ డీపీఎం శ్రీనివాస్, మాట్లాడుతూ.. ముందుగా మండల మహిళా సమాఖ్య సభ్యురాలు సమావేశం నిర్వహించారు. మహిళలందరూ తమ కాళ్లపై తామే నిలబడి, ఆర్థిక శక్తిగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనని మహిళలందరికీ తెలియజేశారు. ఈ సమావేశంలో మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మండలంలోని వివిధ గ్రామాల మహిళలందరూ పాల్గొన్నారు. ముందుగా కార్యాలయాన్ని  శుభ్రంచేసి ముగ్గులు వేశారు. అనంతరం ఆటపాటలు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు సందడి చేస్తూ ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో శ్రీనివాస్, డిపిఎం నూకల శ్రీనివాస్, ఏపీఎం సత్యనారాయణ, మండల సమైక్య పాలకవర్గ సభ్యులు అయిన భూమవ్వ, పి. లక్ష్మీ, గ్రామ సంఘాలకు సంబంధించిన అధ్యక్షురాలు, గ్రామ సంఘం అసిస్టెంట్లు, సీసీలు, స్త్రీనిధి మేనేజర్ ప్రవీణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -