Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోతుల నుంచి రక్షణ కల్పించాలి.!

కోతుల నుంచి రక్షణ కల్పించాలి.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : కోతుల నుంచి రక్షణ కల్పించాలని తహశీల్దార్ రవికుమార్ కు తాడిచర్ల గ్రామానికి చెందిన తాండ్ర మార్కు,గొనె రవిందర్ రావు,రాజు తదితరులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నిత్యం కోతులు చిన్న పిల్లలపై, వృద్ధులపై దాడులు చేస్తున్నాయని, రోజురోజుకూ ప్రజలు భయాందోళనకు గురివుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై వెళ్ళాలంటే ప్రజలు జంకుతున్నారని తెలిపారు. ఒకవైపు కోతులు, మరోవైపు కుక్కల స్వైర విహారంతో ప్రజలు జీవించడం కష్టతరంగా మారిందని తెలిపారు. కోతులు, కుక్కల దాడుల్లో  తీవ్రంగా గాయపడిన ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారని తెలిపారు. క్షణాల్లో కోతులు ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులపై దాడులు చేస్తున్నాయని అన్నారు. పంటలు, కూరగాయలు తోటలను సైతం ధ్వంసం చేస్తూ రైతులకు తీవ్రంగా నష్టం కలిగిస్తున్నట్టుగా తెలిపారు. ఇప్పటికైనా పారెస్ట్ అధికారులతో కోతులను ఇక్కడి నుంచి తరలించి, ప్రజలను వాటి బెడద నుంచి కాపాడాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -