Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలి

మహిళలు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలి

- Advertisement -

ఇందిర మహిళా శక్తి సంబరాల కార్యక్రమాల్లో ఎంపీడీఓ రాణి
నవతెలంగాణ – మద్నూర్
: మహిళలు అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని మద్నూర్ మండల ఎంపీడీఓ రాణి పిలుపునిచ్చారు. ఇందిరా మహిళ శక్తి సంబరాల సందర్భంగా ప్రత్యేక మండల సమాఖ్య సమావేశం మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి రేణుక  ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో మద్నూర్ ఎంపీడీవో శ్రీమతి రాణి, డోంగ్లీ మండల ఇన్చార్జి ఎంపీడీఓ వెంకట నర్సయ్య, హాజరై మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత అంశాలను సభ్యులకు వివరించారు. 

ఈ సమావేశంలో గత  2024-25 సం.లో సాధించిన అన్ని రకాల పనులలో ప్రగతిని, కొత్త సంఘాల ఏర్పాటు, బ్యాంక్ రుణాలు, స్త్రీనిధి రుణాలు, జీవనోపాధులు, వడ్డీ రాయితీ, స్కూల్ యూనిఫామ్స్, వరి ధాన్యం కొనుగోలు, లోన్ భీమా, ప్రమాద భీమా, పాడి పశువులు, పెరటి కోళ్ల పెంపకం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, పీఎం ఎఫ్ఎంఈ, పి ఎం ఈ జిపి,  మరియు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలపై ఏపీఎం రవీందర్ వివరించారు. అదేవిధంగా రాబోయే 2025 26 సంవత్సరానికి సాధించబోయే ప్రగతిని అంశాల వారీగా ఏపిఎమ్  సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమం లో మద్నూర్ &డోంగ్లీ ఎంపీడీఓ లు, ఏపీఎం, మండల సమాఖ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -