- Advertisement -
విద్యార్థులకు పండ్లు పంపిణీ
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం రామాజీపేట మంగళవారం, వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కుండే సిద్ధులు, మొగిలిపాక శంకర్, పంచాయతీ సెక్రెటరీ రాజు, పాల సంఘం మాజీ చైర్మన్ మల్లేష్, నమిలి కేశవులు, కల్లూరు రఘుపతి రెడ్డి, ఆరె బలం రాజు, కోల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -