Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ అధికారుల పొలంబాట..

విద్యుత్ అధికారుల పొలంబాట..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర : వ్యవసాయ క్షేత్రాలకు విద్యుత్ సరఫరా చేసే క్రమంలో ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని విద్యుత్ శాఖ ఏఈ రమేష్ బాబు సూచించారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పొలంబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని గంట్లకుంట గ్రామాల వ్యవసాయ క్షేత్రాల్లో అధికారులు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వంగిపోయిన స్తంభాలను సరిచేసి చెడిపోయిన కెపాసిటర్లు బిగించారు. వదులుగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేశారు. అనంతరం వర్షాకాలంలో ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. విద్యుత్ సమస్య వచ్చినప్పుడు సొంతంగా మరమ్మతులు చేయొద్దన్నారు. ట్రాన్స్ ఫార్మర్ చెడిపోయినా విద్యుత్ శాఖ వాహనంలోనే తీసుకెళ్లి మరమ్మతులు చేసి ఇస్తామని తెలిపారు. ప్రతీరైతు అధికారికంగా కనెక్షన్ తీసుకుని విద్యుత్ వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -