Wednesday, July 9, 2025
E-PAPER
Homeజిల్లాలుఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి 
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. మంగళవారం ఆయన మండలం కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను రాత్రి సుమారు 7.00 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆశ్రమ పాఠశాల పరిసరాలను పరిశీలించి, స్టోర్ గదిని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టడీ అవర్స్ లో ఉన్న  విద్యార్థులతో మాట్లాడుతూ.. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని, వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.

విద్యార్థులు విద్యను అభ్యసించడంలో మెలుకువలు నేర్చుకోవాలని, జీవిత ఆశయం కోసం సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవాలని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును మాత్రం పక్కనపెట్టకూడదని, విద్యార్దులు బట్టి పట్టే విధానాన్ని కాకుండా.. విషయాన్ని అర్థం చేసుకుంటూ చదుకోవాలని అన్నారు. టీచర్స్ విద్యార్దులకు అర్థమయ్యే విధంగా విద్యను బోధించాలని తెలిపారు. కలెక్టర్ వెంట డిఎఫ్ఓ రాహూల్ కిషన్ జాదవ్, స్థానిక తహసిల్దార్ సురేష్ బాబు, హాస్టల్ వార్డెన్ మోకాళ్ళ లక్ష్మి తదితరులు ఉన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -