Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పాలమూరు ఎత్తిపోతలను పక్కన పెట్టింది: మాజీ మంత్రి

ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పాలమూరు ఎత్తిపోతలను పక్కన పెట్టింది: మాజీ మంత్రి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ల విడుదల సందర్భంగా కాంగ్రెస్ నేతల ఆరోపణలను బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. ఇవాళ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా నదిలో ప్రవాహం మొదలై 40 రోజులు గడుస్తున్నా కేఎల్ఐ మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదని ప్రశ్నించారు. మోటార్లను ఆపకుండా కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నీటితో నింపాలని ప్రభుత్వానికి సూచించారు. పాలమూరు పనులు పూర్తి చేసి నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లను నింపాలి కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పాలమూరు ఎత్తిపోతల పనులను పక్కన పెట్టిందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -