నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సామాజిక వేత్త, ప్రముఖ న్యాయవాది పి.సుందరయ్య(71) మృతి బాధాకరమని ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలూ) రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఆయన మృతికి సంతాపం తెలిపింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ మేరకు ఐలూ గౌరవాధ్యక్షులు జి.విద్యాసాగర్, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొల్లి సత్యనారాయణ, కె.పార్థసారధి, ఆ సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.ప్రవీణ్, సి.రామచంద్రారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సామాజిక అణచివేతలకు గురైన పేదల పక్షాన ఆయన జీవితాంతం కొట్లాడారని గుర్తుచేశారు. అనేక పుస్తకాలు రచించారని తెలిపారు. తమ సంఘం కార్యకలాపాల్లో ఆయన చురుకుగా పాల్గొనేవారని గుర్తుచేశారు. సుందరయ్యకు ఇద్దరు కుమారులున్నారని తెలిపారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సామాజికవేత్త, న్యాయవాది సుందరయ్య మృతి బాధాకరం : ఐలూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES