Wednesday, July 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనలందనగర్‌లో హైడ్రా కూల్చివేతలు

నలందనగర్‌లో హైడ్రా కూల్చివేతలు

- Advertisement -

– అడ్డుకున్న పట్టాదారులు, మహిళలు
– జేసీబీకు అడ్డుగా పడుకుని నిరసన
– అరెస్టు చేసిన పోలీసులు, రాజేంద్రనగర్‌ పీఎస్‌కు తరలింపు
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ సర్కిల్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని నలందనగర్‌లో పార్కు స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు భారీ బందోబస్తు మధ్య మంగళవారం కూల్చివేశారు. నలందనగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కమిటీ సభ్యులు తమ పార్కు స్థలం కబ్జాకు గురైందని ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా అధికారులు వెయ్యి గజాల పార్కు స్థలం కబ్జాకు గురైందని తేల్చారు. దాంతో మంగళవారం ఉదయమే భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య జేసీబీల సాయంతో పార్కు స్థలంలో నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించారు. అయితే ఆ స్థలం తమదే అని అక్కడున్న పట్టాదారులు హైడ్రా అధికారులతో గొడవకు దిగారు. మహిళలు జేసీబీలకు అడ్డంగా పడుకున్నారు. దాంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కూల్చివేతలను అడ్డుకుంటున్న మహిళలను, స్థానిక వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత 1000 గజాల స్థలాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఫెన్సింగ్‌ని ఏర్పాటు చేశారు. సుమారు రూ.10 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా అధికారులను స్థానికులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -