Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయం14 దేశాలపై భారీ సుంకాలు

14 దేశాలపై భారీ సుంకాలు

- Advertisement -

– ఆగస్ట్‌ 1 నుంచి అమలు ొ లేఖలు పంపిన ట్రంప్‌
వాషింగ్టన్‌ :
అమెరికా వాణిజ్య భాగస్వాములపై దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒత్తిడి పెంచారు. ఆగస్ట్‌ 1వ తేదీ నుంచి వర్తించే నూతన టారిఫ్‌ రేట్లపై దక్షిణాఫ్రికా, మలేసియా సహా 14 దేశాల అధినేతలకు ఆయన తన సంతకంతో లేఖలు పంపారు. అయితే ‘ప్రతీకార’ సుంకాల అమలుకు గతంలో ప్రకటించిన గడువును ఆగస్ట్‌ 1వ తేదీ వరకూ పొడిగించారు. కానీ చైనాకు ఈ వెసులుబాటు కల్పించకపోవడం గమనార్హం. వాస్తవానికి వాణిజ్య భాగస్వాములపై విధించిన ప్రతీకార సుంకాలు బుధవారం నుంచి అమలులోకి రావాల్సి ఉంది. ప్రతీకార టారిఫ్‌ రేట్లు ఏప్రిల్‌లో ప్రకటించిన వాటి కంటే ఎక్కువగానో లేదా తక్కువగానో ఉండవచ్చునని వివిధ దేశాలకు పంపిన లేఖలలో ట్రంప్‌ తెలియజేశారు. దాదాపుగా వాణిజ్య భాగస్వాములందరి పైన పది శాతం బేస్‌ టారిఫ్‌, 50 శాతం వరకూ గరిష్ట సుంకం విధిస్తున్నట్లు ట్రంప్‌ ఏప్రిల్‌ 2న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాను విధించిన దిగుమతి సుంకాల అమలుకు ట్రంప్‌ 90 రోజుల విరామం ప్రకటిం చారు. ఆ గడువు బుధవారం ముగుస్తుంది. ఇప్పుడు

తాజాగా ఆ గడువును ఆగస్ట్‌ 1వ తేదీ వరకూ పొడిగించారు. ట్రంప్‌ నుంచి ముందుగా లేఖలు అందుకున్న వారిలో జపాన్‌ ప్రధాని షిజెరు ఇస్హిబా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మియుంగ్‌ ఉన్నారు. జపాన్‌, దక్షిణ కొరియా దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించే ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఆ తర్వాత మలేసియా, కజక్‌స్థాన్‌, దక్షిణాఫ్రికా, మయన్మార్‌, లావోస్‌ దేశాల నేతలు కూడా లేఖలు అందుకున్నారు. ఆయా దేశాలపై 40 శాతం వరకూ సుంకం విధించారు. మూడో విడతలో తునీసియా, బోస్నియా, హెర్జెగోవినా, ఇండోనేషియా, బంగ్లాదేశ్‌, సెర్బియా, కాంబోడియా, థారులాండ్‌ దేశాల నేతలకు లేఖలు అందాయి. అమెరికా వాణిజ్య లోటును ట్రంప్‌ తన లేఖలలో ప్రముఖంగా ప్రస్తావించారు. టారిఫ్‌ రేట్లు ఇతర విధానాలపై కూడా ఆధారపడి ఉంటాయని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad