Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమోడీ ఖాబర్ధార్… కదిలింది కార్మికలోకం

మోడీ ఖాబర్ధార్… కదిలింది కార్మికలోకం

- Advertisement -

లేబర్ కోడ్ లు రద్దు చేయకపోతే తరిమికొడతాం
– కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకైనా అధికారమిచ్చింది
– 8 గంటల పని విధానం… ₹.26,000 కనీస వేతనం ఉండాల్సిందే
– సంగారెడ్డి జిల్లాలో 90 శాతం పరిశ్రమల్లో ఉత్పత్తి బంద్
– సమ్మెలో కదం తొక్కిన వేలాది కార్మికులు
– కేంద్రం మెడలు మంచే వరకు పోరాటం ఆగదు : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఖబర్దార్ మోడీ కదిలింది కార్మికుల లోకం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ కార్మిక వర్గాన్ని బానిసలు చేసేలా అమలు చేయాలని చూస్తున్న నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుస్తామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు హెచ్చరించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కార్మిక లోకం పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. వందశాతం కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనడంతో పారిశ్రామిక ప్రాంతంలో ఉత్పత్తికి బ్రేకులు పడ్డాయి.

పెట్టుబడిదారులపై ఒత్తిడి తేవడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వచ్చే విధంగా కార్మిక లోకం కదం తొక్కింది. సంగారెడ్డి జిల్లా కేంద్రం పటాన్చెరువు జయరాబాద్ పాశమైలారం మెదక్ గజ్వేల్ దుబ్బాక సిద్దిపేట లాంటి పట్టణాలలో వేలాది మంది కార్మికులు భారీ ఊరేగింపులు నిర్వహించి సభలు జరిపారు జిల్లా కేంద్రాలలో కలెక్టెట్లను ముట్టడించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సంగారెడ్డిలో జరిగిన భారీ ర్యాలీ బహిరంగ సభకు సిఐటి రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

కార్మికులకు అన్యాయం చేస్తూ లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తున్నా బోడి ఖబర్దార్ కార్మిక లోకం దేశవ్యాప్తంగా కదిలింది సంఘటితమై పోరాటాల్లోకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచేవరకు కార్మిక వర్గ పోరాటాలు ఆగవని సుక్క రాములు స్పష్టం చేశారు. కార్పోరేట్ శక్తులు పెట్టుబడిదారులకు ఊడిగం చేసేందుకే ప్రజలు బిజెపికి అధికారం కట్టబెట్టారా అని ప్రశ్నించారు దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం పొట్టగొట్టే విధంగా కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోళ్లు తీసుకురావాలనుకోవడం మోడీ దుర్మార్గమైన చర్య అని ఆయన అభివర్ణించారు. లేబర్ కోళ్లు అమలు అయితే దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం కట్టు బానిసలుగా మారాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

Pashamilaram
CITU-led strike in Pashamilaram Industrial Cluster successful.. Huge bike rally

కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు నువ్వు కాలర్ రాయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కార్మికులు యూనియన్ పెట్టుకోకుండా జీతభత్యాల కోసం సదుపాయాల కోసం వేరసారాలు ఆడకుండా చేయడం అంటే అది పెట్టుబడుదారుల లాభాలను కాపాడడం తప్ప మరోటి కాదన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక లోకం లేబర్ కోట్ల రద్దు కోసం సమ్మె చేస్తుంటే ఆర్ఎస్ఎస్ బిఎంఎస్ లాంటి సంస్థలు రాజకీయం చేస్తున్నాయని యద్దేవ చేయడం సిగ్గుగా ఉందన్నారు కార్మికులు ప్రజలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టాలు చేస్తున్న మోడీ చేస్తున్నది రాజకీయం కాకుండా మరిన్ని ఆయన ప్రశ్నించారు.

కార్మిక వర్గమంతా లేబర్ కార్డులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె పోరాటం చేస్తుంటే బిఎంఎస్ మాత్రం పాలకవర్గాలకు తొత్తుగా మారి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. కార్మికుల లోకంతో పాటు రైతాంగానికి తీరని అన్యాయం చేస్తూ నల్ల చట్టాలు తెచ్చిన మోడీ మెడలు వంచి పోరాడిన ఫలితంగానే వెనక్కి తగ్గాడని స్పష్టం చేశారు రాబోయే కాలంలో మరింత సమరశీలంగా పోరాడడం ద్వారా మాత్రాన్ని లేబర్ కోళ్లను రద్దు చేయించుకోగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బి మల్లేశం ఉపాధ్యక్షులు బాగా రెడ్డి సహాయ కార్యదర్శి యాదగిరి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బి ప్రసాద్ ఐ ఎన్ టి సి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -