Wednesday, July 9, 2025
E-PAPER
Homeజిల్లాలుఇబ్రహీంపట్నంలో కదిలిన కార్మికలోకం..

ఇబ్రహీంపట్నంలో కదిలిన కార్మికలోకం..

- Advertisement -

సార్వత్రిక సమ్మె సక్సెస్
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారీ ర్యాలీలు
ప్రధాన కూడళ్లలో మానవహారాలు
లేబర్ కోడ్ లు రద్దు చేయాల్సిందే
8 గంటల పని విధానమే అమలు చేయాలి
కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలి 
సమ్మెలో కదం తొక్కిన కార్మికులు
మోడీ ప్రభుత్వం దిగిరావాల్సిందే: సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు స్వప్న
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం 

కార్మిక లోకం కదిలింది సార్వత్రిక సమ్మె సక్సెస్ అయ్యింది భారీ ర్యాలీ నిర్వహించారు ప్రధాన కోణాలలో మానవహారం చేశారు లేబర్ కోడులను రద్దు చేయాల్సిందేనని నినదించారు. పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాల్సిందేనని సూచించారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వం దిగి రావాల్సిందేనని, అప్పటివరకు అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు స్వప్న డిమాండ్ చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కార్మిక లోకం పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనడంతో పరిశ్రమలు స్తంభించాయి.

ఆర్టీసీ చక్రాలు సైతం ఆగిపోయాయి. ఒకటి అర బస్సులు మాత్రమే రోడ్లపై కనిపించాయి. దాంతో రంగారెడ్డి జిల్లాలో సమ్మె విజయవంతమైంది. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నంలో జరిగిన సమ్మెలో కార్మిక లోకం కదం తొక్కింది. ముందుగా వివిధ రంగాల కార్మికులు అంబేద్కర్ చౌరస్తాలో పోగయ్యారు. అక్కడినుండి ఆర్టీసీ డిపో మీదుగా మళ్లీ అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. కార్మికులకు అన్యాయం చేస్తూ లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దిగిరావాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కార్పోరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు ఊడిగం చేసేందుకే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కార్మిక వర్గం కడుపు కోత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావాలనుకోవడం దుర్మార్గమన్నారు. కేవలం కార్మికులకే కాకుండా వ్యవసాయ రంగాన్ని సైతం బడా పారిశ్రామికవేత్తల చేతుల్లోకి మార్చేందుకు నల్ల చట్టాలు తెచ్చిన మోడీ మెడలు వంచి పోరాడిన ఫలితంగానే వెనక్కి తగ్గారని స్పష్టం చేశారు. కానీ రద్దు చేశామని చెబుతున్న నల్ల చట్టాలను మరో రూపంలో అమలు చేసేందుకే మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మండిపడ్డారు. ఈ ప్రమాదాన్ని అడ్డుకోకపోతే వ్యవసాయ రంగం ప్రశ్నార్థకమవుతుందని తెలిపారు.

రైతులే పంట పొలాల్లో కూలీలుగా మారే పరిస్థితి ప్రభుత్వ తీసుకురానున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎల్లేశ, బుగ్గరాములు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు బోడ సామెల్, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు జంగయ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి జగన్, ఐద్వా జిల్లా అధ్యక్షులు విజయమ్మ, ప్రజా సంఘాల నాయకులు వెంకటేష్, ముసలయ్య, పురుషోత్తం, శంకర్, ఆనంద్, గణేష్, వీరేష్, నరసింహ, వంశీ, తరంగ్, కార్మికులు లక్ష్మయ్య, బేబీ, యాదయ్య, రాధా, జయమ్మ, చంద్రకళ, మన్నెమ్మ, దేవదాస్, సత్యనారాయణ, శ్రీకాంత్, యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -