నవతెలంగాణ – కంఠేశ్వర్ : సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఐద్వా నిజామాబాద్ జిల్లా కమిటీ మద్దతు బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి సమగ్ర చట్టం చేయాలి. దేశంలో విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, మహిళలకు రక్షణ, ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల అణిచివేతకు గురవుతున్నటువంటి నిరుపేదలకు రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది.
కార్మిక హక్కులను కుదించి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడడమే కాకుండా మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయింది. అలాగే ప్రతి రంగంలో పని చేస్తున్న మహిళలకు భద్రత కల్పించాలి. మగవారితో సమానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఉపాధి కూలి రేట్లు పెంచాలి. రైతులకు గిట్టుబాకు ధర ఇవ్వాలి. ప్రతి రంగంలో పనిచేస్తున్న వారికి ఇన్సూరెన్స్ బీమా పథకాలు అమలు చేయాలి. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేదంటే ఐద్వా ఆధ్వర్యంలో రాను నాకు కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, యశోద, రేఖ, సంగీత, సంపత, లక్ష్మీ, జ్యోతి, ఇతర శాఖ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెకు ఐద్వా మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES