నవతెలంగాణ – ముధోల్
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నియోజకవర్గం కేంద్రమైన ముధోల్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు, ఆశ, అంగన్ వాడీ కార్యకర్తలు, సమ్మెలో పాల్గొని రాస్తారోకోకు దిగారు. మండలంలోని అంగన్వాడి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్మికులు వచ్చి ఐబి దగ్గర సమావేశం నిర్వహించారు. ఆనంతరం స్థానిక ఐబీ నుండి ర్యాలీగా వెళ్లి నయబాది చౌరస్తాలో కొద్ది సేపు రాస్తారోకో నిర్వహించారు. ఆనంతరం సిఐటియు నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షుడు పోశేట్టి మాట్లాడుతూ కొత్త లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
స్కీమ్ వర్కర్లకు కనీసం వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ, పేన్షన్ హక్కు లను కల్పించాలని ఆయన పేర్కొన్నారు. పనిగంటల పెంపును నిరోధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్వవసాయ కార్మిక సంఘం నాయకులు గందం లింగన్న , అంగన్ వాడీ, ఆశ కార్యకర్తలు, పంచాయతీ కార్మికులు రేష్మా, ఆరిసియా, విజయ లక్ష్మి, సుజాత,రమా, భూమన్న, సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.