సోమ మల్లారెడ్డి..సీఐటీయూ జిల్లా ఫ్రాక్షన్ కమిటీ మెంబర్
నవతెలంగాణ – గోవిందరావుపేట : తహశీల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా దేశంలో బిజెపి పార్టీ, ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం తహశీల్దార్ సృజన్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఫ్రాక్షన్ కమిటీ మెంబర్ సోమ మల్లారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు.
దేశంలో 29 కార్మిక చట్టాలను సవరిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని మండిపడ్డారు. నాలుగు లేబర్ కోడ్ తీసుకువచ్చి కార్పొరేట్ అనుకూల విధానాలు అనుసరిస్తుందని ఆరోపించారు. 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి 10 గంటల పని విధానం తీసుకువచ్చిందని, కనీస వేతన చట్టం సవరించి రోజుకు రూ.178లతో సగటు మనిషి జీవించాలని అనడం ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. సంఘం పెట్టుకునే హక్కు లేకుండా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రాథమిక హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. జుట్టబోయిన రమేష్ ఉపేంద్ర చారి పద్మారాణి ఐలయ్య గ్రామపంచాయతీ కార్మికులు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్స్ హమాలి యూనియన్ సభ్యులు కలం కార్మికులు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నిరంకుశ విధానాలను వ్యతిరేకించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES