No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మంత్రి సీతక్క పుట్టినరోజు వేడుకలు

ఘనంగా మంత్రి సీతక్క పుట్టినరోజు వేడుకలు

- Advertisement -

– ఐకెపి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగాధర్
– పేదలకు బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి  : మండలంలోని బషీరాబాద్ చౌట్ పల్లి గ్రామాలలో ఐకెపి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగాధర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి సీతక్క పుట్టినరోజు వేడుకలను ఆదర్శవంతంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా కేకులు, స్వీట్లు ఇతర సంబరాలకు డబ్బులు వృధా చేయకుండా పలువురు నిరుపేద మహిళలను గుర్తించి వారికి బియ్యం, పప్పులు, ఇతర నిత్యవసర వస్తువులను ఐకెపి సిబ్బంది, మహిళలు సమక్షంలో అందజేసి మంత్రి సీతక్క పుట్టినరోజు వేడుకలను ఆదర్శవంతంగా ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల ఐకెపి ఎపిఎం, ఐకెపి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలకు వృధా ఖర్చులు చేయకుండా తమ సంస్థ ప్రధాన లక్ష్యమైన పేదలకు సహకరించేలా ఉండాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగానే మహిళా సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి  ధనసరి అనసూయ సీతక్క పుట్టినరోజు వేడుకలను నలుగురు నిరుపేదలకు బియ్యం, పప్పులు, ఇతర నిత్యవసరాలు బషీరాబాద్, చౌట్ పల్లి గ్రామాలలో పంపిణీ చేసి చేసామన్నారు.

తద్వారా మహిళా సంఘ సభ్యులు తమ పిల్లల పుట్టిన రోజున కూడా ఇతర పేదలకు సహకరించేలా సందేశం ఇవ్వగలిగామని తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి బియ్యం, పప్పులు మహిళా సమాఖ్య ప్రతినిధులు, సిబ్బంది సమకూర్చడం విశేషం. కార్యక్రమంలో సిసిలు భాగ్యలక్ష్మి, పీర్య, చౌట్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, వివోఏలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad